ఉపాధి హామీ పథకం ద్వారా రైతుల పొలాలకు నల్ల మట్టి సరఫరా పనులను పరిశీలించిన ఎం పి డి ఓ సంతోష్ కుమార్
పయనించే సూర్యుడు 24.4. 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్
నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ బెజ్జోరా గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా రైతుల పొలాలకు నల్ల మట్టి సరఫరా పనులను పరిశీలించడం అయినది ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ ఎండ తీవ్రత పెరుగుతున్నందున కూలీలు ఉదయం పూటనే పనులను ముగించుకోవాలని తెలిపినారు. చెరువులో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్డు పట్ల సంతృప్తి వ్యక్తం చేసినారు కూలీలకు పని స్థలంలో నీటి సరఫరా చేస్తున్నందున సంబంధిత పంచాయతీ కార్యదర్శి ఫీల్డ్ అసిస్టెంట్లను అభినందించినారు మరియు ఉపాధి హామీ కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను సరఫరా చేసినారు ఈ కార్యక్రమంలో ఏపీఓ జీ నర్సయ్య టెక్నికల్ అసిస్టెంట్ స్వామి దాస్ పంచాయతీ కార్యదర్శి స్వప్న ఫీల్డ్ అసిస్టెంట్ ప్రవీణ్ ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు

