
జిల్లా కలెక్టర్ డా. వి వినోద్ కుమార్ అన్నారు.
పయనించే సూర్యుడు బాపట్ల సెప్టెంబర్ 23 రిపోర్టర్ (కే.శివ కృష్ణ)
సోమవారం,స్థానిక కలెక్టరేట్ లోని వీక్షణ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్ కలెక్టర్ కార్యాలయ పి.జి.ఆర్.ఎస్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాపట్ల జిల్లా పరిపాలనలో అన్ని విభాగాలలో ఇతర జిల్లాల కంటే ర్యాంకింగ్లో మొదటి మూడు వలసలలో ఉండే విధంగా సిబ్బంది పని చేయాలని ఆయన అన్నారు. ప్రతి ఉద్యోగి పోటీ తత్వంతో పనిచేయాలన్నారు. పి జి ఆర్ ఎస్ కు వచ్చే ప్రతి సమస్యను పారదర్శకతతో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని ఆయన చెప్పారు. పి జి ఆర్ ఎస్ కు సంబంధించి నివేదికల విభాగాలను మండల,శాఖల, అధికారుల వారీగా తయారుచేసి అందజేయాలని ఆయన తెలిపారు. పిజిఆర్ఎస్ కు వచ్చే సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.జిల్లాలో ఏమైనా సమస్యలు ఏర్పడిన యెడల, వాటి విషయాలు తెలుసుకుని సత్వర పరిష్కార చర్యల కొరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డా. వి వినోద్ కుమార్, డిఆర్ఓ కు తెలిపారు. ఈ కమాండ్ కంట్రోల్ డిఆర్ఓ ఆధ్వర్యంలో పనిచేస్తుందని ఆయన తెలిపారు. కంట్రోల్ రూమ్ నందు ప్రతి శాఖకు సంబంధించి ఒక ప్రతినిధి ఉండాలన్నారు. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ లో రెండు టీవీలను ఏర్పాటు చేసి న్యూస్ చానల్స్ లో వచ్చే వార్తలను ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేసి సమస్యల సత్వర పరిష్కార చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జి సంయుక్త కలెక్టర్ మరియు జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, పిజిఆర్ఎస్ నోడల్ అధికారి నాగిరెడ్డి, కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి మల్లికార్జున రావు, పిజిఆర్ఎస్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.
