సినిమా వార్తలు

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి.

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి.

పయనించే సూర్యుడుD.07.10.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్. ఏఐసీసీ మరియు పీసీసీ ఆదేశాల మేరకు ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్ రెడ్డి అధ్యక్షతన కేంద్ర ఎన్నికల సంఘము కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ని తక్షణమే రాజీనామా చేయాలని నిజామాబాద్ లోని ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించి అనంతరం జ్ఞానేశ్ కుమార్ దిష్టి బొమ్మ దహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా నగేష్ రెడ్డి మాట్లాడుతు కేంద్ర ఎన్నికల కమిషనర్ బీజేపీ ప్రభుత్వానికి తోత్తుగా వ్యవహారిస్తునరని,దేశంలో 13కోట్లకు పైగా ఓట్లనీ తొలగించారని, రాష్ట్రములో దాదాపు 90లక్షలు పైగా, జిల్లాలో అర్బన్లో దాదాపు 80వేలకు పైగా ఓట్లు తొలగించారని బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహారిస్తూ ప్రజాస్వామ్యాన్ని అణిచివేసివిధంగా ఈ ఎన్నికల కమిషనర్ వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు.మా పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ కేంద్ర ప్రభుత్వానికి, సీఈసీకి వ్యతిరేకంగా కొట్లాడితే అరెస్టు చేయడం చాలా బాధాకరమన్నారు.కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రిగా, రాష్ట్రములో మరోసారి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సారద్యంలో మరోసారి అధికారంలోకి వస్తుందని ఆశభావం వ్యక్తం చేసారు.కేంద్ర ఎన్నికల సంఘము నిర్వహిస్తున్న సర్ ప్రోగ్రాం పూర్తిగా కేంద్రానికి అనుకూలంగా ఉందని, జిల్లాలో పీసీసీ ఆదేశాల మేరకు మండల కేంద్రాల్లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ధర్నాలు, దిష్టి బొమ్మలు దహన కార్యక్రమాలు చేసారాని, ఈరోజు జిల్లా కేంద్రంలో నిర్వహించమని మున్ముందు గ్రామ స్థాయిలో ఇలాంటి ఆందోళనలు నిర్వహించడం జరుగుతుందన్నారు.కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేసేంత వరకు మున్ముందు ఏఐసీసీ మరియు పీసీసీ ఆదేశాల మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ,సీపీయం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి సుధాకర్ , సీపీఐ ఏంఎల్ మాస్ లైన్ అర్బన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ , ఆర్ఎస్పి జిల్లా కార్యదర్శి రాములు , నగర మేయర్ ఉమారాణి ,కల్లుగీత కార్మిక చైర్మన్ శేఖర్ గౌడ్,నూడా చైర్మన్ కేశ వేణు , వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ , మాజీ ఎమ్మెల్సీలు అరికెల నర్సారెడ్డి , ఆకుల లలిత , ఆర్మూర్ నియోజకవర్గ ఇంచార్జి వినయ్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ , మహిళ నాయకులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, నగర కార్పొరేటర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS