తడపాకల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఏకరూప దూస్తుల పంపిణీ..

September 11, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడుD.11.9.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్. బాల్కొండ నియోజకవర్గంలో ఏర్గట్ల మండలంలో
ఏర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలో ఈరోజు శుక్రవారం రోజున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలొ సర్పంచ్ జింక స్వప్న అనిల్ కుమార్ మరియు ఉపసర్పంచ్ లోలపు రాజు చేతుల మీదుగా విద్యార్థిని విద్యార్థులకు ఏకరూప దూస్తుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన షూస్ మరియు యూనిఫామ్స్ అందిస్తుందని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కొరకు ఎంతగానో ఖర్చు చేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తుందని వారు తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper