తడ మండలం ‌చిన్న మంబట్టు గ్రామ చెరువులో మట్టిని తవ్వి కోట్ల రూపాయలకు ప్రైవేటు వ్యక్తులు విక్రయాలు

June 11, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు జూన్ 11( సూళ్లూరు పేట నియోజక వర్గ0రి పోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజవర్గంలోని తడ మండలం చిన్న మాంబటు గ్రామ చెరువులోని మట్టి నీ ఏ ఎమ్ ఆర్ ఇండియా లిమిటెడ్ సంస్థ .ప్రైవేటు కంపెనీలకు వేరే వ్యక్తుల ద్వారా మట్టి విక్రయాలు చెరువు నుండి జెసిపి లతో తవ్వి దాదాపు కోట్లు విలువ చేసే మట్టినీ కంపెనీకి తోలుతుంది మట్టి తోలే దగ్గర దగ్గర ఏ ఎం ఆర్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఉద్యోగి అయినటువంటి సూపర్వైజర్ దగ్గరుండి మట్టి తవ్వి తోలుస్తున్నాడు అతనిని వివరణ అడగ్గా మట్టి ఇంత లోతు ఎవరి పర్మిషన్ తో కంపెనీలకు తోలుతున్నారని అడిగితే ఇరిగేషన్ అధికారులు స్థానికంగా ఒక వ్యక్తికి పర్మిషన్ ఇచ్చారు అతను మట్టి తవ్వి కంపెనీకి తోలుతున్నాడు మేము కేవలం ఒక ట్రిప్ కి ధర నిర్ణయించి ఆ వ్యక్తి నుండి డబ్బులు వసూలు చేస్తున్నామని చెప్తున్నారు. ప్రైవేట్ కంపెనీలకు మట్టి విక్రయాలు జరుగుతున్నాయని వేరే వ్యక్తి ద్వారా జరుగుతున్నాయని ‌సమాధానం తెలిపారు ఇరిగేషన్ అధికారులు ఒక వ్యక్తికి చెరువు నుండి ఇంత మట్టి తవ్వి ప్రైవేట్ కంపెనీలకు విక్రయించడానికి ఎలా పర్మిషన్ ఇస్తారో ప్రభుత్వ ‌అధికారులకే తెలియాలి? చెరువులో ఇంత మట్టి తవ్వడం వలన చెరువులోని సహజ రేగడి మట్టి‌ మొత్తం పోయి లోతు ఎక్కువైనందువలన రాబోయే కాలంలో ఆ చెరువులో నీరు నిలువ లేకుండా భూగర్భ జలాలు ఇంకుపై ప్రమాదం ఉంది గ్రామస్తులు వ్యవసాయ భూమిలో మట్టి తోలుకునేందుకు మరియు గ్రామంలోని నివాస స్థలాలకు మట్టి తోలుకునేందుకు మాత్రమే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వాలి అలా కాకుండా ప్రైవేట్ కంపెనీలకు మట్టిని తోలెందుకు అంత మొత్తంలో మట్టిని తరలించడం ఆ మట్టి నుండి వచ్చే ఆదాయాన్ని ఏ ఎం ఆర్ ఇండియా లిమిటెడ్ అనే ప్రైవేటు సంస్థ , మరియు స్థానిక ప్రైవేటు వ్యక్తి తీసుకోవడం స్థానిక ప్రజలకు ఆశ్చర్యనికి గురిచేస్తుంది ఈ విషయమై ఇరిగేషన్ అధికారులు దర్యాప్తు చేసి చర్యలు చేపట్టాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు

🌐 Select Language:
📰 ePaper