తల్లికి వందనానికి మరో అవకాశం – ఆగస్టు 3 వరకు ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణ

July 26, 2026 | సినిమా వార్తలు

పయ నించే సూర్యుడు జూలై 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ : పత్రికా ప్రకటన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం దాట్ల సుబ్బరాజు నాలుగు మండలపేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందించే “తల్లికి వందనం” పథకంలో అర్హులైన వారికి మరో అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ముఖ్యమైన తేదీలు:ఆగస్టు 3 వరకు: ఫిర్యాదులు మరియు అభ్యంతరాల స్వీకరణ ఆగస్టు 4 నుంచి 10 వరకు: వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేయడంఆగస్టు 25 వరకు*: ఒకటో తరగతి, జూనియర్ ఇంటర్ లో కొత్తగా చేరిన విద్యార్థులకు ప్రవేశాలకు అవకాశంఆగస్టు 30: రెండో విడతలో తల్లుల ఖాతాల్లో నిధుల జమస్వచ్ఛ గ్రామ/వార్డు కార్యాలయాల్లో అర్హులు, అనర్హుల జాబితాలను ప్రదర్శిస్తున్నారు. ఆగస్టు 30వ తేదీన కొత్తగా అర్హత పొందిన విద్యార్థులతో పాటు మొదటి విడతలో లబ్ధి పొందని అర్హుల ఖాతాల్లో కూడా ఆర్థిక సహాయం జమ చేయనున్నారు.”అర్హులైన ప్రతి విద్యార్థికి ప్రభుత్వం అండగా ఉంటుంది” అని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ పథకానికి సంబంధించిన ప్రకటనను ప్రభుత్వ విప్, ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ట సుబ్బరాజు విడుదల చేశారు.

🌐 Select Language:
📰 ePaper