మంత్రి వాసంశెట్టి సుభాష్ ను కలిసిన రామచంద్రపురం నూతన డిఎస్పి మల్లా శేషు

July 26, 2026 | ఆంధ్రప్రదేశ్

పయనించే సూర్యుడు జూలై 26 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) ప్రజల భద్రతే ప్రధమ కర్తవ్యంఅసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం* రామచంద్రపురం :* రామచంద్రపురం ఉప విభాగ పోలీసు అధికారిగా బాధ్యతలు స్వీకరించిన మల్లా శేషు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ను ఆయన శిబిర కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. విశాఖపట్నంలో నేర పరిశోధన విభాగంలో విధులు నిర్వహించిన మల్లా శేషు సాధారణ బదిలీలలో భాగంగా రామచంద్రపురం ఉప విభాగ డిఎస్పిగా బాధ్యతలు చేపట్టారు. గతంలో పలు కీలక విభాగాల్లో సేవలందించి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందిన ఆయన, ప్రత్యేక దర్యాప్తు బృందంలో ప్రత్యేక అధికారిగా కూడా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ రామచంద్రపురం ఉప విభాగంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజలకు ప్రశాంతమైన, సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు పోలీసు శాఖ కృషి చేయాలని, నేరాల నియంత్రణలో మరింత సమర్థవంతంగా పనిచేసి ఉప విభాగానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.*అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం* డిఎస్పి మల్లా శేషు మాట్లాడుతూ గంజాయి, జూదం, పేకాట, కోడిపందాలు వంటి అసాంఘిక కార్యకలాపాల పై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. తన పరిధిలో నేరాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తామని, నేరాల రేటును తగ్గించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, గంజాయి రవాణా మరియు విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. జూదం, పేకాట, కోడిపందాలు నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.ప్రజల సహకారంతో నేరహిత, ప్రశాంత రామచంద్రపురం నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పట్టణ వృత్త పరిశీలకులు వెంకటనారాయణ, పట్టణ ఉప పరిశీలకులు నాగేశ్వరరావు, పామర్రు ఉప పరిశీలకులు సోమేంద్ర తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper