తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు
ప్రభుత్వ పాఠశాల నుండి భగత్ సింగ్ చౌక్ మీదుగా ఆంజనేయ టెంపుల్ ర్యాలీ ప్రదర్శన
పయనించే సూర్యుడు ఆగస్టు1 మక్తల్ మండలంలోని దాసర్ దొడ్డి లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఆగస్టు 1 నుండి 7 వరకు నిర్వహించాలని పిలుపులో భాగంగా అంగన్వాడి కేంద్రాలలో తల్లి పాల ప్రాముఖ్యత గురించి వివిధ రూపాలలో ర్యాలీలో నినాదాలతో డబ్బా పాలు వద్దు తల్లిపాలే ముద్దు, పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టించాలని, కేవలం 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే తాగించాలని, తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించారు.మొట్టమొదటగా గర్భిణి గర్భం దాల్చిన నుండి పౌష్టికాహారంతో పాటు ఆకు కూరగాయలు, పండ్లు, పాలు తీసుకోవాలని వివరించారు. 0 నుండి 5 సంవత్సరాల పిల్లలకు ఇమినేజేషన్ చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బాలమణి, ప్రధానోపాధ్యాయులు గోపాల్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి అరవింద్, ఏఎన్ఎం వేదవతి, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ బసవలింగమ్మ, సువర్ణ, చందాపూర్ అంగన్వాడి టీచర్ విజయమ్మ, తిరుమలాపూర్ టీచర్ నాగేంద్రమ్మ, ఆశా వర్కర్లు పార్వతమ్మ, జి వెంకటమ్మ, హెల్పర్లు కవిత లక్ష్మి, నర్మదా.బసవలింగమ్మ అంగన్వాడీ టీచర్ దాసరి దొడ్డి. తదితరులు పాల్గొన్నారు