తూనికలు కొలతలు శాఖ అధికారుల ఆకస్మిక తనిఖీలు

August 6, 2026 | ఆంధ్రప్రదేశ్

పయనించు సూర్యుడు ఆగస్టు 6 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ())డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తూనికలు కొలతల శాఖ ఇంచార్జి ఇన్స్పెక్టర్ వి ఎస్ మోహన్ ఆధ్వర్యంలో గురువారం కాట్రేనికోనలో షాపులు నిర్వహిస్తున్న దుకాణాలను తనిఖీ చేశారు.తూనికలు కొలతల శాఖ నిబంధనలు సక్రమంగా పాటించని పలు దుకాణాల కటాలను పరిశీలన చేశారు. ఒక మటన్, ఎరువులు, షాపులలో కాటాలకు కేసులు నమోదు చేశామని మోహన్ తెలియజేశారు.వ్యాపారులు వినియోగించే ఎలక్ట్రానిక్ పరికరాలకు ఒక సంవత్సరం, రాళ్లు ఉపయోగించే ఆర్డినరీ కాటాలకు రెండు సంవత్సరాలు గడువు తీరిన తరువాత సీల్ వేయించుకోవాలని, ఈ విధంగా నిబంధనలను పాటించకుండా తప్పుడు తూకాలు నిర్వహిస్తూ వ్యాపారాలు చేస్తే కేసులు నమోదు చేసి జరిమానా విధించడం జరుగుతుందని ఆయన తెలిపారు.
వారితోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper