నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన టి జి ఎస్ ఆర్ టి సి రీజియన్ మేనేజర్ . టి. జోస్నా
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్
నిజాంబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ టీ జి ఎస్ ఆర్ టి సి నిజామాబాద్ రీజియన్ రీజినల్ మేనేజర్ జిలా కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్కు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.సమావేశంలో నిజామాబాద్ జిల్లాలో జి ఎస్ ఆర్ టి సి బస్సు రవాణా వ్యవస్థ, ప్రజలకు మెరుగైన సేవలు, ప్రయాణికుల భద్రత, రవాణా సౌకర్యాల అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. జిల్లాలో ప్రజలకు సౌకర్యవంతమైన, సురక్షితమైన రవాణా సేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగం మరియు టి జి ఎస్ ఆర్ టి సి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ఆర్ఎం మేడం వివరించారు. ఈ సమావేశంలో టీజీఎస్ ఆర్టీసీ నిజామాబాద్-1 డిపో మేనేజర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.