నేడు కోట్ల దయానంద రచించిన ” సాహితీ మణిపూసలు” పుస్తక ఆవిష్కరణ

August 8, 2026 | సినిమా వార్తలు

( పయనించే సూర్యుడు ఆగస్టు 09 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )షాద్నగర్ పట్టణంలోని పెన్షనర్ భవన్ లో ఈ రోజు ఆదివారం రోజు ఉదయం 10 గంటలకు సాహితీ కళాభారతి మరియు శ్రీ అనంత సాహిత్య సంస్కృతిక సంయుక్త వేదికల ఆధ్వర్యంలో కోట్ల దయానందం రచించిన సాహితి మణిపూసలు అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ కోట్ల దయానందం మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పుస్తక ప్రేమికులు, సాహితివేతలు ప్రతి ఒక్కరూ హాజరై తమ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

🌐 Select Language:
📰 ePaper