హనుమాన్ మందిరం నిర్మాణం యొక్క టెండర్ అప్రూవల్ కాపీని అందజేసిన ముధోల్ మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డి .

August 8, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో:కుబీర్ మండల కేంద్రంలో శ్రీ హనుమాన్ మందిరం నిర్మాణం యొక్క టెండర్ ఈరోజు గ్రామ పంచాయతీ సర్పంచ్ ,మరియు గ్రామస్తులకు అందజేయడం జరిగింది.టెండర్ అప్రూవల్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన సభ్యులు శ్రీ జి విఠల్ రెడ్డి .ఈ కార్యక్రమంలో కుబీర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కళ్యాణ్, గ్రామ సర్పంచ్ సాయినాథ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మైపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ విజయ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రెటరీ సూది రాజన్న,మాజీ ఏఎంసీ చైర్మన్ సంతోష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నారది మల్లేష్, డాక్టర్ పెంటాజి, మైనార్టీ నాయకులు జావీద్, మాజీ ఎంపిటిసి నాగలింగం, సాయినాథ్, పేట దేవన్న విట్టల్ పటేల్ సిద్దూర్ పోతన్న, తెనూగు శేఖర్, తంబాల పోతన్న, సూది గంగాధర్, శంకర్, మరియు గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

🌐 Select Language:
📰 ePaper