పంజాబ్ భూముల సమస్యను పరిష్కరించాలి
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి
యువ నాయకుడు గైక్వాడ్ సాయినాథ్ ఝరి
నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఝరి బి గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో పంజాబ్ భూముల సమస్య బాగా పెరిగిపోయింది. పంజాబ్ భూమి అమ్మిన సర్వే నంబర్, మరియు అదే సర్వే నంబర్ లో ఉన్న భూములను లాక్ వేయడం జరిగింది. దయచేసి తాసిల్దార్ , సబ్ కలెక్టర్ జిల్లా కలెక్టర్ , రెవెన్యూ కలెక్టర్ గారు దీనిపై ఆరా తీసి మా యొక్క సమస్యను తీర్చాలి. క్రాప్ లోన్ రెన్యువల్ చేయడానికి వెళితే మా గ్రామానికి ఒక రైతు మేకల ఈశ్వర్ దాస్, మీ భూమికి లాక్ వేయడం జరిగింది. మీ యొక్క ఖాతను క్లోజ్ చేయండి క్రాప్ లోన్ కట్టు అని మేనేజర్ గారు తెలపడం జరిగింది. డబ్బులు లేని వ్యక్తి ఎలా చేయాలని నేను కోరుతున్నాను, ఇప్పుడు రైతు దగ్గర డబ్బులు లేవు మరి ఆ యొక్క క్రాప్ లోను ఎలా క్లోజ్ చేస్తాడు. ఎందరో బీద రైతులు అదే సర్వే నంబర్లు మీ అమ్మకపోయినా అదే సర్వ నంబర్ను లాక్ వేయడం జరిగింది దయచేసి తొందరలోనే ఈ యొక్క సమస్యను పరిష్కరించి గ్రామ గ్రామాన వెళ్లి ఎవరైతే కచ్చితంగా అమ్మరో వారికి లాక్ వేయండి మిగతా వారికి లాక్ తీసేయగలరని మా గ్రామం తరపున మేము కోరుతున్నాము, ఇప్పుడు కొందరు రిజిస్ట్రేషన్ చేసుకునే వ్యక్తులు కూడా ఉన్నారు కానీ లాక్ ఉండడం వలన ఆ యొక్క రిజిస్ట్రేషన్ కావడం లేదు దయచేసి దీన్ని తొందర్లోనే గ్రామ గ్రామాన వెళ్లి ఆ యొక్క పంజా భూముల సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాము. గైక్వాడ్ సాయినాథ్ ఝరి