పదవీ విరమణ చేసిన భారజల కర్మాగార టీ ఎన్ టి యు సి నాయకునికి సన్మానం*

August 3, 2026 | తెలంగాణ

*……సన్మానించిన అశ్వాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ బానోత్ సదర్ లాల్*

పయనించే సూర్యుడు, ఆగస్ట్ 03, అశ్వాపురం: సోమవారం నాడు టీ ఎన్ టి యు సి నాయకులు శ్రమ శక్తి అవార్డు గ్రహీత కూరపాటి శ్రీనివాసరావు పదవీ విరమణ సందర్భంగా అశ్వాపురం గ్రామ పంచాయతీ పాలకవర్గం తరపున సన్మానం చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో అశ్వాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ సదర్ లాల్ మాట్లాడుతూ 1992 వ సంవత్సరంలో తుళ్లూరు బ్రహ్మయ్య భారజల కర్మాగారం లో టీ ఎన్ టి యు సి కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. తాము అందరం ఆ సంఘంలో తాళ్లూరి బ్రహ్మయ్య నాటిన మొక్కలమని, టీ ఎన్ టి యు సి మొదటి నుంచి భార జల కర్మ గారం లో గుర్తింపు పొందిన కార్మిక సంస్థ అని ఎన్నో అసోసియేషన్ ఎన్నికలలో సత్తా చాటినది అని, మొన్న జరిగిన అసోసియేషన్ ఎన్నికలలో కూడా టీ ఎన్ టి యు సి తన సత్తా చాటినది అని అందులో తామందరికి సేవ చేసే భాగ్యం కలిగినది అని, ఆ గుర్తింపు మూలంగానే అశ్వాపురం గ్రామపంచాయతీకి మూడు సార్లు సర్పంచ్ గా సేవలు అందించే అవకాశం మా కుటుంబానికి దక్కింది అని, కూరపాటి శ్రీనివాసరావు కరోనా సమయంలో సుమారు వంద రోజులు కరోనా బాధితులకు చుట్టుపక్కల గ్రామాలలో భోజనాలు తయారుచేసి తన సేవలను అందించారు ఆని ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని ఈ పదవి విరమణ ఆయన ఉద్యోగానికి కానీ ఆయన వ్యక్తిత్వానికి కాదు అని భవిష్యత్తులో కూడా ఆయన ప్రజాసేవ చేయాలని కోరుకుంటున్నాము అని, ఈ సందర్భంగా వారి స్వగృహం నందు దంపతులిద్దరికీ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ తుళ్లూరు ప్రకాష్ రావు మరియు పాలకవర్గ సభ్యులు మొరివినేని చంద్రకళ,చెట్టుపల్లి రామ దేవి,పాయం నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper