పర్యావరణహిత ఫ్రెండ్లీ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమల ఉచిత పంపిణీ

September 13, 2026 | ఆంధ్రప్రదేశ్

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 13 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) వినాయక చవితి సందర్భంగా పర్యావరణానికి మేలు చేసే మట్టి వినాయక బొమ్మలను కాట్రేనికోన ఫ్రెండ్లీ క్లబ్ వ్యవస్థాపకుడు ఆకొండి నాగ రవీంద్ర జోగయ్య శాస్త్రి తన ఇంటి వద్ద వెయ్యి మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల కలిగే కాలుష్యాన్ని నివారించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలనే ఉద్దేశంతో గత కొన్నేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మట్టి గణపతులను పూజించడం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగదని, భక్తితో పాటు బాధ్యత కూడా అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆకొండి ఉమామహేశ్, బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ, వేదుల హనుమాన్, ఆకొండి విశ్వనాధం, ఆకొండి సాయి, గ్రంధి దత్తుడు, కాద సత్యనారాయణ, గ్రంధి ప్రసాద్, ఆకొండి సూర్యకాంతం, పార్ధు, సిరివదన, మోక్ష, నవీన్, జితేంద్ర, సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper