PS Telugu News
Epaper

పిప్రి లిఫ్ట్ కు మహర్థశపట్టుబట్టి నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

📅 10 Mar 2026 ⏱️ 2:13 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి

77 కోట్ల నిధుల మంజూరు చేస్తూ ప్రభుత్వ జి. వో. విడుదల

ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ రైతంగానికి సాగునీరు అందించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. ముధోల్ నియోజకవర్గం సస్యాశామలం కావాలన్నది అయన కల.. అందులో భాగంగా లిఫ్ట్ ఇరిగేషన్ లకు నిధులు, చెరువుల మరమ్మత్తులకు నిధులు ఇవ్వాలని పలు మార్లు అసెంబ్లీ లో ప్రస్థావించడం తో పాటు హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రుల ను కలవడం, ముఖ్య మంత్రి కి విన్నవించడం తో ఇక నియోజకవర్గానికి ఇరిగేషన్ లో నిధుల వరద ప్రారంభమైంది.. చెరువులు, లిఫ్ట్ ల పనులు ప్రారంభం కాగా పిప్రి లిఫ్ట్ కు 77 కోట్ల నిధులు విడుదల చేస్తూ సర్కార్ జి. వో. విడుదల చేసింది.. పనులు పూర్తయితే లోకేశ్వరం మండలం లోని పలు గ్రామాల్లో వేలాది ఎకరాల్లో సాగునీరు అందనుంది.. జి. వో విడుదల పట్ల రైతుల్లో హర్షం వ్యక్తం అవుతుంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి, ఇంచార్జి మంత్రి కి కృతజ్ఞతలు చెప్పారు…

Scroll to Top