ప్రజల మధ్యే ప్రజాప్రతినిధి.. సంక్షేమం నుంచి అభివృద్ధి వరకు వరుస కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ .
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి: పేదల సొంతింటి కల సాకారం.. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ …కళాశాలలో ఆకస్మిక తనిఖీ.. విద్యా ప్రమాణాలపై రాజీ లేదన్న ఎమ్మెల్యే…గ్రామీణ అభివృద్ధికి మరో అడుగు.. రూ.1 కోట్ల సీసీ రోడ్ల పనులకు శ్రీకారం…విఠలేశ్వరుని ఆశీస్సులతో ప్రజాసేవ.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే….కుభీర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ముధోల్ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వo నిరుపేదలకు సొంత ఇంటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. లబ్ధిదారులు మంజూరు పత్రాలను సద్వినియోగం చేసుకొని త్వరితగతిన ఇళ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు.అలాగే ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే..*కుభీర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కళాశాలలో విద్యార్థుల హాజరు, బోధన పరిస్థితులు, మౌలిక వసతులను పరిశీలించారు. తరగతి గదులను సందర్శించి ఉపాధ్యాయులతో నేరుగా మాట్లాడి బోధన నాణ్యతపై ఆరా తీశారు. కొంతమంది ఉపాధ్యాయులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించడాన్ని గుర్తించి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో రాజీ పడకుండా సమయపాలనతో బోధన నిర్వహించాలని ఉపాధ్యాయులకు హెచ్చరించారు. విద్యా ప్రమాణాల పెంపుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కళాశాల యాజమాన్యానికి సూచించారు.ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రూ.1 కోటి సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమిపూజ..మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో సుమారు రూ.1 కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ముధోల్ ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్ భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. కొత్తగా నిర్మించనున్న సీసీ రోడ్లు గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందించడంతో పాటు వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగిస్తాయని తెలిపారు. పనులను నాణ్యత ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.అనంతరంవిఠలేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే…ముధోల్ ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్ కుభీర్ మండలంలోని ప్రసిద్ధ విఠలేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇటీవల నూతనంగా ఎన్నికైన ఆలయ కమిటీ సభ్యులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై చర్చించారు. ఆలయ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విలువలను పరిరక్షించేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేసి ఆలయ అభివృద్ధికి సహకారం అందించాలని కోరారు.కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.