ప్రజా సంక్షేమమే లక్ష్యం — ముధోల్ మండలంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ శ్రీకారం…..
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి
మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భూమి పూజ
ముధోల్ మండలంలోని 1కోటి 37 లక్షల నిధులతో పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ గారు ఈరోజు భూమి పూజ నిర్వహించారు.
మండలంలోని రామ్‌టెక్ గ్రామంలో వీవో బిల్డింగ్ మరియు సీసీ రోడ్డు నిర్మాణానికి, మచ్కల్ గ్రామంలో వీవో బిల్డింగ్, సీసీ రోడ్డు నిర్మాణానికి, ముద్గల్ గ్రామంలో వీవో బిల్డింగ్ మరియు సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. అలాగే సరస్వతి నగర్ గ్రామంలో అంగన్‌వాడి భవనం మరియు సీసీ రోడ్డు నిర్మాణానికి, బోరేగాం గ్రామంలో వీవో బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.అదేవిధంగా చింతకుంట గ్రామంలో పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి, చింతకుంట తండాలో అంగన్‌వాడి భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. అనంతరం లోకేశ్వరం మండలంలోని కనకాపూర్ గ్రామంలో వీవో భవన నిర్మాణానికి కూడా భూమి పూజ కార్యక్రమం చేపట్టారు.ఈ అభివృద్ధి పనులతో గ్రామాల్లో మౌలిక వసతులు మెరుగుపడి ప్రజలకు ఉపయోగం చేకూరుతుందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు
