ప్రేమ పెళ్లి చేసుకున్న దళితుడి ఇల్లును కూల్చేయడం అమానుషం

September 12, 2026 | తెలంగాణ

ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి నిందితులను కఠినంగా శిక్షించాలి

ప్రభుత్వం బాధితులకు కొత్త ఇంటిని నిర్మించి,నష్టపరిహారం అందించాలి

పోలీసులు ప్రేమ జంటకు రక్షణ కల్పించాలి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మక్తల్

పయనించే సూర్యుడు సెప్టెంబర్14మక్తల్ :గద్వాల జిల్లా రేపల్లి గ్రామంలో గత రెండురోజుల క్రితం బీసీ ముదిరాజ్ కులానికి చెందిన అమ్మాయినీ ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్న దళిత యువకుడి ఇంటిని అమ్మాయి కుటుంబ సభ్యులు కూల్చివేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని మక్తల్ పట్టణంలోని ఐ.బి లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులన్నారు.కులాలు వేరైనా తమకు నచ్చిన వారినీ ప్రేమించి వివాహం చేసుకోవడ మనేది రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమైనప్పటికీ ఏమాత్రం లెక్కచేయకుండా అందరూ చూస్తుండగానే వధువు కుటుంబ సభ్యులు జె.సి.బి లతో యువకుడి ఇల్లుతో పాటు అతడి చినాన్న ఇంటిని కూల్చడం ముమ్మాటికి చట్టాన్నీ దిక్కరించినట్టేనని కాబట్టి ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులందరికీ కఠినంగా శిక్షపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇది కేవలం ఒక ఇంటిపై జరిగిన దాడి కాదనీ కుల అహంకారంతో దళితుల ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు.మనిషి అంతరిక్షానికి అడుగులేస్తున్న కుల వివక్షతకు కారణమవుతున్న అగ్రకుల మనువాద భావజాలాన్ని వీడకపోవడం బాధాకరమన్నారు.ప్రభుత్వం బాధిత కుటుంబానికి నష్టపరిహారంగా కొత్త ఇంటిని నిర్మించివ్వాలని అలాగే వధువు కుటుంబ సభ్యులనుండి యువ దంపతులకు పూర్తి రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నమన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు సందీప్,జుట్ల సాయికుమార్, బాడల్ దినేష్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper