మోదీ నాయకత్వంలో బ్రిక్స్ వేదికపై సమున్నతంగా భారత కీర్తి పతాకం
ఫలితంగా విశ్వ వ్యాప్తంగా పెరిగిన దేశ ప్రతిష్ట
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 12 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ) బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి. బ్రిక్స్–2026 అంతర్జాతీయ వేదికపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల నేతలతో కలిసి విశ్వహితమే ధ్యేయంగా కీలక దిశానిర్దేశం చేశారని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై తన ప్రాభవాన్ని మరింతగా చాటుకుందని, ఈ దౌత్య విజయం భారతావని కీర్తి పతాకాన్ని సమున్నతంగా ఎగురవేసిందని అన్నారు.ఫలితంగా దేశ ప్రతిష్ట మరోసారి విశ్వ వ్యాప్తంగా రుజువైందని అన్నారు. బ్రిక్స్ సదస్సు ద్వారా ప్రపంచ దేశాలతో భారత్ సంబంధాలు మరింత బలోపేతం కావడంతో పాటు, అంతర్జాతీయ వ్యవహారాల్లో భారతదేశం కీలక పాత్ర పోషిస్తున్న తీరుకు ఈ సదస్సు మరో నిదర్శనంగా నిలిచిందని ఏలూరి పేర్కొన్నారు. ప్రధాని మోదీతో సెల్ఫీ తీసుకునేందుకు విదేశీ ప్రతినిధులు చూపిన ఉత్సాహం, ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో లభిస్తున్న విశేష ఆదరణకు ప్రతిబింబమని అన్నారు. స్నేహం, సహకారం, విశ్వాసమే ప్రాతిపదికగా మోదీ అనుసరిస్తున్న విదేశాంగ విధానం ప్రపంచ దేశాల మధ్య భారత్ పట్ల నమ్మకాన్ని మరింత పెంచుతోందని తెలిపారు. భిన్నమైన అభిప్రాయాలు, విభేదాలు ఉన్న దేశాలతోనూ చర్చలు, దౌత్యం ద్వారా సంబంధాలను కొనసాగిస్తూ భారత ప్రయోజనాలను కాపాడటంలో మోదీ నాయకత్వం ప్రత్యేక ముద్ర వేస్తోందన్నారు. ప్రపంచంలోని కీలక శక్తులతో భారత్ సన్నిహిత దౌత్య సంబంధాలను కొనసాగిస్తూ, సంక్లిష్టమైన అంతర్జాతీయ పరిస్థితుల్లోనూ సంభాషణకు ప్రాధాన్యం ఇవ్వడం మోదీ దౌత్య విధానంలోని ప్రత్యేకత అని ఆయన అన్నారు. భారత్ ప్రయోజనాలతో పాటు ప్రపంచ శాంతి, అభివృద్ధి, సహకారానికి ప్రాధాన్యం ఇస్తూ మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోందని బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రా రెడ్డి అన్నారు.