ఎస్సీ కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం చేసిన సర్పంచ్ బాసు నాయక్

September 12, 2026 | తెలంగాణ

( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 13 షాద్నగర్ నియోజకవర్గం ఇన్చార్జి నరేందర్ నాయక్ ) కొత్తూరు మండల్ సిద్దాపూర్ గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ ను షాద్నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే నిధులనుండి నిర్మించబడింది, ఈరోజు సిద్దాపూర్ గ్రామ సర్పంచ్ బాసు నాయక్ ఆధ్వర్యంలో ఎస్సీ కమిటీ హాల్ను ఓపెనింగ్ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఉప సర్పంచ్ దొబ్బల యాదయ్య వార్డు మెంబర్స్ ఖయ్యూం ఖాన్, పిప్పల్లా గణేష్, కిషన్ నాయక్, బ్యాగరి మల్లేష ,వెంకట్ నాయక్, గుండమ్మని నరసింహ, కొత్తూరు మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లారం శేఖర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి రాశుల జంగయ్య , గ్రామ పెద్దలు , ఎర్రోళ్ల జంగయ్య , పాషా, దొబ్బల పెద్ద మైసయ్య ,గుండమ్మని కుమార్, కమ్మరి జనార్ధన్ చారి, మోడీ మల్లేష్, దొబ్బల భీమయ్య , గ్రామ ప్రజలు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper