బండోనీగూడలో గుంటి మల్లన్న విగ్రహా,ధ్వజ స్థంభ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

June 17, 2026 | తెలంగాణ

( పయనించే సూర్యుడు జూన్ 18 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) నందిగామ మండల పరిధిలోని బండోనీగూడ గ్రామంలో భక్తుల ఆరాధ్య దైవమైన గుంటి మల్లన్న విగ్రహా,ధ్వజ స్థంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్సి నవీన్ రెడ్డి పాల్గొన్నారు.గ్రామ అభివృద్ధి,ఆధ్యాత్మిక పరిరక్షణకు తన వంతు సహకారంగా గుంటి మల్లన్న విగ్రహం ఏర్పాటుకు రూ.3.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించిన ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పుడూ కొనసాగుతుందని తెలిపారు.గ్రామ ప్రజల ఐక్యత,భక్తి భావానికి ఈ విగ్రహం ప్రతీకగానిలుస్తుందన్నారు.కార్యక్రమంలో పూజారులు శివానందం,కర్ణాకర్ చేగుర్ సింగిల్ విండో డైరెక్టర్ జాలగూడెం అనిత సాములయ్య,మాజీ సింగిల్ విండో డైరెక్టర్ బండ మల్లేష్, మాజీ వార్డు నెంబర్ బండ నరసింహ,నర్సప్ప గూడ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జంగిల్ కుమార్, బండ శ్రీశైలం,బండ అశోక్,బండ కుమార్, జెట్ట మహేందర్,చేగుర్ పబ్బే నరేందర్,జాల గూడెం శ్రీశైలం,నర్సిమ మరియు ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు,యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper