బిజెపి బలోపేతానికి కృషి చేద్దాం : ఉప్పలగుప్తం మండల సమావేశం

August 7, 2026 | ఆంధ్రప్రదేశ్

పయ నించే సూర్యుడు ఆగస్టు ఏడు ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజవర్గంఉప్పలగుప్తం మండల భారతీయ జనతా పార్టీ సమావేశం మండల అధ్యక్షులు నల్ల సత్తిబాబు అధ్యక్షతన భీమనపల్లిలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా మండల ఇంచార్జి అడపా శ్రీనివాసరావు, అమలాపురం అసెంబ్లీ సమన్వయకర్త సంసాన్ వెంకటరత్నకుమార్, రాష్ట్ర యువ విభాగం అధికార ప్రతినిధి గనిశెట్టి అరవింద్, మండల ప్రధాన కార్యదర్శి జంపన సూరపరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సంఘటన ప్రక్రియలో భాగంగా బూత్ స్థాయి కమిటీలను పూర్తి చేసినందుకు మండల కమిటీ అభినందనలు తెలియజేసింది. అదేవిధంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల ప్రకారం మండలంలో 12 శక్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేస్తామని మండల సమావేశంలో తీర్మానించారు. ప్రతి నెల 7వ తేదీలోపు మండల సమావేశం ఏర్పాటు చేసుకుంటామని తెలియజేశారు.

🌐 Select Language:
📰 ePaper