PS Telugu News
Epaper

బైంసా పట్టణంలోని గోపాల్‌రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు గర్వకారణం

📅 12 Feb 2026 ⏱️ 6:09 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో

భైంసా నివాసి అనుజ్ శర్మకు సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగం – జమ్మూ కాశ్మీర్‌లో నియామకం
భైంసా: గోపాల్‌రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భైంసా మరోసారి తన ప్రతిష్ఠను చాటుకుంది. కళాశాలకు చెందిన బీకాం రెంవవ సంవత్సరం చదువుకున్న విద్యార్థి, భైంసా నివాసి అనుజ్ శర్మ (సీఆర్‌పీఎఫ్ ) కానిస్టేబుల్‌గా ఎంపిక కావడం గర్వకారణంగా నిలిచింది. ఆయనకు జమ్మూ కాశ్మీర్‌లో నియామకం లభించడం విశేషం. విద్యార్థి కృషి, పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర సాధనకు ఇది ప్రతిఫలంగా నిలిచిందని అధ్యాపకులు తెలిపారు.ఈ సందర్భంగా కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ కే. రఘునాథ్ మాట్లాడుతూ,“మన కళాశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుకోవడం ఎంతో సంతోషకరం. భైంసా ప్రాంతానికి చెందిన అనుజ్ శర్మ జమ్మూ కాశ్మీర్ వంటి కీలక ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌గా సేవలందించడం మనందరికీ గర్వకారణం. ఈ విజయం ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలవాలి. మన కళాశాల ఎల్లప్పుడూ విద్యార్థుల ఉన్నతికి కట్టుబడి ఉంటుంది,” అని పేర్కొన్నారు.కామర్స్ విభాగాధిపతి జి. సుధాకర్ , డాక్టర్ ఓం ప్రకాష్ , ఐక్యూఏసి కోఆర్డినేటర్ రవికుమార్ , డాక్టర్ భీమరావు , డాక్టర్ శంకర్ , డాక్టర్ కోసారి సంతోష్ , డాక్టర్ కల్పన , తదితర అధ్యాపకులు అనుజ్ శర్మను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.విద్యార్థి భవిష్యత్తులో ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ, మిగతా విద్యార్థులు కూడా ఈ విజయాన్ని ఆదర్శంగా తీసుకుని తమ లక్ష్యాలను సాధించాలని ఉపాధ్యాయులు సూచించారు.ఈ విద్యాసంవత్సరంలోనే కళాశాల నుండి ఇప్పటివరకు ఐదుగురు విద్యార్థులు వివిధ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు సాధించడం విశేషం. కళాశాల బృందం ఈ విజయాలపై హర్షం వ్యక్తం చేస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Scroll to Top