బైంసా పట్టణంలోని గోపాల్ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లోచాకలి ఐలమ్మ వర్ధంతి నివాళులు ఘనంగా నిర్వహించారు.

September 10, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో బైంసా: గోపాల్‌రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బైంసాలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రఘునాథ్ మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు.ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జె. ఓంప్రకాశ్ మాట్లాడుతూ, చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకుని సమాజంలో సమానత్వం, న్యాయం, ఆత్మగౌరవం కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆమె జీవితం యువతకు ఒక గొప్ప ప్రేరణ అని అన్నారు.ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ డాక్టర్ యు. రవికుమార్, అధ్యాపకులు డాక్టర్ శంకర్, రాజు, డాక్టర్ కల్పన, సురేందర్, డాక్టర్ సంతోష్, రాజయ్య, శ్రవణ్య ముత్యం, రామకృష్ణ, కె. దివ్య, ఉజ్మా, అర్షియా తదితరులు పాల్గొని చాకలి ఐలమ్మకు ఘన నివాళులర్పించారు.

🌐 Select Language:
📰 ePaper