భీంగల్ మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక సహాయం.

పయనించే సూర్యుడు D.27.7.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్.భీమ్గల్ మండలంలోభీంగల్ మున్సిపాలిటీలో ఔట్‌సోర్సింగ్ విధానంలో ఎలక్ట్రిషన్‌గా విధులు నిర్వహిస్తున్న కోట నర్సయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి స్వామి మరియు కమిషనర్ మరియు కౌన్సిలర్లు, నర్సయ్య అంత్యక్రియల కోసం మున్సిపల్ తరఫున ₹10,000 ఆర్థిక సహాయం అందజేశారు.మృతుడి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ డి. గజానంద్ కౌన్సిలర్ తోట సతీష్. అంజుమ్ ఆలీ. సందీప్ మరియు ప్రజా ప్రతినిధులు జేజే నర్యయ్య. కన్నె సురేందర్. ఆరేపల్లి నాగేంద్ర. బోదిరే నర్యయ్య. అనంతరావు తదితరులు పాల్గొన్నారు