రైతులకు సబ్సిడీపై యూరియా అందుబాటులో ఉంచిన కాట్రేనికోన ప్యాక్స్

July 27, 2026 | సినిమా వార్తలు

పయనించు సూర్యుడు జూలై 27 ముమ్మిడివ)రం (ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకాట్రేనికోన : మండలంఖరీఫ్ సీజన్ నేపథ్యంలో కాట్రేనికోన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో నూతన ఎరువుల విక్రయాలను ప్రారంభించారు. మొదటి విడతగా యూరియా విక్రయాలను సంఘ అధ్యక్షులు పెసింగి రంగారావు వర్మ ప్రారంభించారు.ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన ఎరువులు సకాలంలో, సబ్సిడీ ధరకే అందించడమే సంఘ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ సీజన్ లో ఎలాంటి కొరత లేకుండా తగినన్ని నిల్వలు ఉంచామని చెప్పారు. రైతులు ఎవరూ మధ్యవర్తులను, బ్లాక్ మార్కెట్ ను ఆశ్రయించవద్దని సూచించారు.సంఘ పరిధిలోని రైతులందరికీ అవసరమైన మేరకు ఎరువులు అందుబాటులో ఉంటాయని, సమయానికి సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల సౌకర్యార్థం ఉదయం నుంచి సాయంత్రం వరకు విక్రయాలు కొనసాగుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు చేకూరి వెంకట కృష్ణంరాజు, మోకా అప్పాజీ, నీటి వినియోగదారుల సంఘ అధ్యక్షులు వాసంశెట్టి రాజేశ్వరరావు, రైతు నాయకులు ఓలేటి భూషణం, పితాని రమేష్, దొమ్మేటి నాగేశ్వరావు, పంతాడి గణేష్ రాజశేఖర్, సానబోయిన వెంకటేశ్వరావు, వ్యవసాయ సలహా కేంద్రం సభ్యులు మనోజ్, సుధ, సంఘ ముఖ్య కార్యనిర్వహణ అధికారి మరియు సిబ్బంది పాల్గొన్నారు.రైతులు పంటలకు అవసరమైన ఎరువులను సంఘం నుంచే తీసుకోవాలని అధ్యక్షులు కోరారు.

🌐 Select Language:
📰 ePaper