భైంసా పట్టణంలో ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో:*శోభ యాత్ర లో పాల్గొన్న ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్,మునిసిపల్ చైర్మన్ తూమొల్ల దత్తాత్రి.తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భైంసా పట్టణంలో వేడుకలు ఘనంగా జరిగాయి. పురాణ బజార్ లోని మార్వాడి భవన్ నుండి ప్రారంభమైన విఠలేశ్వరుని పల్లకి యాత్ర ప్రధాన వీధుల గుండా కొనసాగింది. ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ శోభయాత్రను ప్రారంభించి, శోభయాత్ర పూర్తయ్యే వరకు భజన దిండి లతో కలిసి యాత్రలో ఉన్నారు. చిన్నారులు విఠల్ రుక్మిణి భక్త తుకారం వేషధారణలో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ మాట్లాడుతూ వార్కరి సాంప్రదాయం ప్రపంచంలోనే చాలా గొప్పదని, ఆధ్యాత్మిక మార్గంతో ఐక్యత భావం పెంపోందడం తో పాటు సన్మార్గం వైపు పయనించగలుగుతామన్నారు. శోభాయాత్రలో భక్తులకు ప్రతి ఇంట స్వాగతం పలికారు. మహిళలు సైతం పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. విఠలరుక్మిణి నామస్మరణ తో ఆ ప్రాంతం మారు మ్రోగింది. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమొల్ల దత్తాత్రి, కౌన్సిలర్లు, ప్రముఖులు, పాల్గొన్నారు