రాష్ట్రంలో ఏర్పడ్డ వర్షభావ పరిస్థితులలో రైతంగాన్ని అన్నీ విధాలా ఆదుకోవాలి

July 25, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడుD.25.7.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్.అన్నిరకాల పంటలకు పంటల భీమా పథకంను రైతు యూనిట్ గా తీసుకొని అమలు చేయాలి.ఏఐయూకెఎస్ రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్ డిమాండ్ రాష్ట్రంలో ఏర్పడ్డ వర్షభావ పరిస్థితులలో రైతంగాన్ని అన్నీ విధాలా ఆదుకోవాలని, అన్నిరకాల పంటలకు పంటల భీమా రైతును యూనిట్ గా తీసుకొని అమలు చేయాలని. అఖిల భారత ఐక్యరైతు సంఘం (ఏఐయూకెఎస్) రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్ డిమాండ్ చేశారుఆర్మూరు పట్టణంలోని కుమార్ నారాయణ భవన్ లో అఖిల భారత ఐక్యరైతు సంఘం (ఏఐయూకెఎస్) జిల్లా అధ్యక్షుడు ఎస్ సురేష్ అధ్యక్షతన జరిగిన నిజామాబాద్ రూరల్ సంయుక్త సమావేశంలో ఆయన ముఖ్యఅతిథులుగా హాజరై ప్రసంగిస్తూ : తెలంగాణ రాష్ట్రంలో ఎల్ నినో వల్ల ఏర్పడ్డ తీవ్ర వర్షభావ పరిస్థితుల వల్ల వ్యవసాయ రంగం పూర్తి సంక్షోభంలో తూర్పు పోయే పరిస్థితులు ఏర్పడగని, తీవ్రమైన కరువు పరిస్థితులు వచ్చే స్థితి ఉందని ప్రభుత్వం దృష్టి సారించి వ్యవసాయ రంగాన్ని కాపాడడానికి ప్రత్యేక కృషి చేయాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన నష్ట నివారణ చర్యలు ముందస్తుగా చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వర్షం అనేది ఇప్పటి ప్రభుత్వ గణంకాల ప్రకారం పడాల్సిన దానికంటే 30% తక్కువ పడ్డదని ఇలా ఉంటే రాష్ట్రంలో తీవ్రమైన సంక్షోభం వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే 90% పూర్తి కావాల్సిన వ్యసరంగా పనులు, ముఖ్యంగా వరి పంట 20 నుండి 30 శాతం , పత్తి పంట సగం పూర్తి అయినా ఎక్కువ శాతం ఎండి పోయి రైతంగాం పూర్తిగా ఆర్థిక నష్టం లో ఉన్నారు అన్నారు. నష్ట పోయరన్నారు. ప్రభుత్వం తక్షణమే ద్రుష్టి సారించి వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకెఎస్) రాష్ట్ర సహాయ కార్యదర్శి బి దేవారం మాట్లాడుతు: రాష్ట్రంలో వర్షభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు 3శాతం లోపలికి పోయాయి అని పరిస్థితి ఇలానే వుంటే త్రాగునిటీకి సహితం తీవ్ర ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉంది అన్నారు. ప్రభుత్వం తక్షణమే నష్ట నివారణ చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకెఎస్) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్ సురేష్, బి బాబన్న, ఉపాధ్యక్షులు యు రాజన్న, యు పరమేష్, సహాయకార్యదర్శులు ఆర్ దామోదర్, బి కిషన్, కోశాధికారి ఎం లింబాద్రి, జిల్లా నాయకులు ఎం నారగౌడ్, టి గంగాధర్, ఇ రమేష్, జి శేఖర్, ఏ సాయిలు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper