భైంసా పట్టణం లో భారీ ఉత్సాహం మధ్య మోహన్ రావు పటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత పోలీస్ కోచింగ్ ప్రారంభోత్సవం.

August 3, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో:భైంసా పట్టణంలోని మోహన్‌రావు పాటిల్ స్టడీ సర్కిల్* (భైంసా జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ ఫ్యాక్టరీ ప్రాంగణం)లో, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ మరియు సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) నియామకాల నోటిఫికేషన్‌ను పురస్కరించుకుని, మోహన్‌రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత పోలీస్ కోచింగ్ కార్యక్రమాన్ని ట్రస్ట్ చైర్మన్ మోహన్‌రావు పాటిల్ , (ఆర్ఎస్ఎస్) నిర్మల్ జిల్లా సహ సంఘ్ చాలక్ కృష్ణదాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మోహన్‌రావు పాటిల్ మాట్లాడుతూ, ప్రతి పోలీస్ అభ్యర్థి ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా లక్ష్యసాధన దిశగా ముందుకు సాగాలని కోరడం జరిగింది అదే విధంగా ప్రజా ట్రస్ట్ అందిస్తున్న వనరులను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో చదివి ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు. అభ్యర్థులు తమ ఆశయాలను సాధించుకునేందుకు మోహన్‌రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.అలాగే, ప్రభుత్వాలు మారినా నియామకా ప్రక్రియలో గంధరగోళలు ఏర్పడిన నిరుద్యోగ యువత నిరాశ చెందకుండా, తప్పుడు ప్రచారాలను నమ్మకుండా, తమ కృషి, పట్టుదలను నమ్ముకుని పోటీ ప్రపంచంలో ముందుకు సాగాలని సూచించారు. ప్రతి అభ్యర్థి విజయమే ప్రజా ట్రస్ట్ లక్ష్యమని, అవసరమైతే చదువులకోసం ఆర్థిక సహకారం అందించేందుకు ట్రస్ట్ సిద్ధంగా ఉంటుందని చెప్పడం జరిగింది*.ఈ కార్యక్రమంలో కార్య విభాగ్ (ఆర్ఎస్ఎస్) ప్రముఖులు దిగంబర్ , (ఆర్ఎస్ఎస్) జిల్లా కార్యవర్గ సభ్యులు దామోదర్ , కౌన్సిలర్ దిలీప్ , గోపాల్ దాస్ ఆకుల , సుభాష్ జాదవ్ , మనోజ్ పాపిన్వార్ , ఇతర నాయకులు, ప్రత్రిక సోదరులు , పోలీస్ అభ్యర్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం లో కృషి చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలపడం జరిగింది.

🌐 Select Language:
📰 ePaper