గుత్తెనదీవి గ్రామదేవత పైడిమల్లమ్మకు అషాడం సారె

పయనించే సూర్యుడు ఆగస్టు 3 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ)ఐ పోలవరం మండలం గుత్తెనదీవి పైడిమల్లమ్మను గ్రామ ఆడపడుచుగా బావించి ఊరి ఆడపడుచులు గ్రామస్తులు పడాలవారి వీధి సాధనాల సుబ్బారావు ఇంటి వద్ద నుండి చలివిడి బిందెలు పానకం బిందెలు చీర రవిక కుంకుమ గాజులు పువ్వులు వివిధ రకాల పండ్లు పిండి వంటలతో మంగళ వాయిద్యములతో కోల సంబరం నృత్యంతో మాతృమూర్తులు గ్రామోత్సవముగా అమ్మవారి నామాన్ని పటిస్తూ బయలుదేరి దేవాలయం చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి సారె సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో ధర్మ ప్రచారక్ బి.కనకారావు మాట్లాడుతూ లోక క్షేమం కోరుతూ అమ్మవారికి సారె సమర్పించడం వలన లోకం సుభిక్షంగా ఉంటుంది సకల ఐశ్వర్యాలు అమ్మ దయతో కలుగుతాయి అన్నారు ఆధ్యాత్మిక సేవకులు డాక్టర్ పి. రామకృష్ణారావు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వలన హిందువుల ఐక్యత పెరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గంగాబత్తుల వెంకటేశ్వరరావు పడాల దుర్గాప్రసాదు లంకెలపల్లి బుల్లయ్య కొప్పరావూరి రాంబాబు గాలి దుర్గారావు లంకెలపల్లి గణేష్ కంతేటి సునీత గ్రామస్తులు భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.