మంచికంటి నగర్ రోడ్డు కు మరమ్మతు కొరకు గ్రామస్తుల ధర్నా
అభిరామ్ గ్యాస్ ఏజెన్సీ కి గ్యాస్ లోడ్ ల తో వస్తున్న వాహనాల వలన నరక యాతన పడుతున్న గ్రామస్థులు
పయనించే సూర్యుడు,జూన్ 12, అశ్వాపురం: శుక్రవారం నాడు అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలోని మంచి కంటి నగర్ లో ఉన్న అభిరామ్ గ్యాస్ గోడౌన్ కు వచ్చే భారీ వాహనాల మూలాన మెటల్ రోడ్డుకు గుంతలు పడి ఆ గుంతలు వర్షపు నీటితో నిండి పోయి ప్రజల రవాణా వ్యవస్థకు పాదచారులకు ఇబ్బందిగా ఏర్పడిన మూలాన మంచికంటి నగర్ గ్రామస్తులు ధర్నా చేస్తూ ఉండగా ఈ విషయం తెలుసుకొని అశ్వాపురం సర్పంచ్ సదర్ లాల్ మరియు ఉప సర్పంచ్ తుళ్లూరి ప్రకాష్ రావు అక్కడికి చేరుకొని సమస్యను విని అభిరామ్ గ్యాస్ గోడౌన్ అధినేతను ఇక్కడికి తక్షణమే రావలసిందిగా డిమాండ్ చేయగా, ఆ గ్యాస్ గోడౌన్ లోని పనిచేసే వ్యక్తి అభిరామ్ గ్యాస్ అధినేత ఊరిలో లేరని తెలపడం జరిగింది. అప్పుడు స్థానిక ప్రజలు ధర్నాను నిలపడం కుదరదని తెలుపగా, అప్పుడు అశ్వాపురం తాసిల్దార్ సూర్యప్రకాష్ రావు కి, సివిల్ సప్లై అధికారి రాజేశ్వరరావు కి చరవాణిలో సర్పంచ్ మాట్లాడగా అశ్వాపురం తాసిల్దార్ మంగళవారం రోజున ఆఫీసులో మీ సమక్షంలో అభిరామ్ గ్యాస్ అధినేతతో మాట్లాడి మీ సమస్యకు పరిష్కారం చేయిస్తానని సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ సమక్షంలో హామీ ఇవ్వగా, సర్పంచ్,ఉప సర్పంచ్ లు కూడా హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ధర్నాను విరమించారు.ఆ ధర్నా కార్యక్రమానికి మంచికంటి నగర్ గ్రామ ప్రజలు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది.