PS Telugu News
Epaper

మండల స్థాయి అధికారులతో ఎంపీడీ ఓ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం

📅 23 Apr 2026 ⏱️ 5:05 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

ప్రజనీకానికి వ్యక్తిగత మరుగుదొడ్లు వాడకం పై అవగాహన, కిచెన్ గార్డెన్ ఏర్పాటు & ఉపయోగం, ప్లాస్టిక్ నిషేధం, ఘన వ్యర్థ పదార్ధాల నిర్వహణ తదితర అంశాలపై మండల స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు & ఇంజనీర్ అసిస్టెంట్ లతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండల ఎంపీడీఓ బి రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరిగా వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగించే విధంగా ప్రజానీకానికి అవగాహన కల్పించాలని సూచించారు.ప్లాస్టిక్ వాడకం వలన కలిగే అనర్ధాలను వివరించారు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల్లో ఘణ వ్యర్థ పదార్ధాల నిర్వాహణ సక్రమంగా జరిగే విధంగా క్షేత్ర స్థాయి సిబ్బంది పూర్తి బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు విరివిగా నిర్వహించి ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీఠ వేయాలని ఆకాంక్షించారు. సదరు శిక్షణలో డిప్యూటీ ఎంపీడీఓ సూర్య నారాయణ రాజు,శిక్షణకు మాస్టర్ ట్రైనీ & కాట్రేనికోన పంచాయతీ కార్యదర్శి జె వి సత్యన్నారాయణ, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీర్ అసిస్టెంట్ లు పాల్గొన్నారు.

Scroll to Top