PS Telugu News
Epaper

మార్కండేయ ఆలయ ధ్వజస్తంభం నిర్మాణానికి 1.6 విరాళం

📅 04 Sep 2025 ⏱️ 2:10 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు గాంధారి 05/09/25

కామారెడ్డి జిల్లా గాంధారి మండలకేంద్రంలో శ్రీ శివ భక్త మార్కండేయ మందిరం కొరకు ధ్వజస్తంభం దాతగా సామల పంచాక్షరీ ఆలయంలో పంతులు చేతుల మీదుగా ప్రత్యేక పూజలు అర్చనలు చేయించి ధ్వజస్తంభం కొరకు 1,60000 రూపాయలు విరాళం ఇచ్చినారు. కుల సంఘం అధ్యక్షుడు బండి రాజు తెలిపారు. వారికి వారి కుటుంబానికి శ్రీ శివ భక్తమార్కండేయని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని తెలిపారు. ఆలయానికి ధ్వజస్తంభం వెన్నుముక లాంటిది. ఇది దేవాలయ ప్రాంగణంలో ఒక ముఖ్యమైన భాగం గర్భగుడిలో ప్రతిష్టించే దేవత విగ్రహం అంతటి ప్రాధాన్యత ధ్వజస్తంభానికి ఉంది. సాంప్రదాయం ప్రకారం ధ్వజస్తంభంలో దైవ శక్తి ఉంటుంది కాబట్టి భక్తులు దీనికి నమస్కరించి ప్రదక్షిణలు చేస్తారు. ఈ కార్యక్రమంలో సామల శేఖర్, తాటి లింగం, గుంటుకు అశోక్, రాజు, మామిడి శీను, క్యాతం కృష్ణ, తాటిపాముల శివ, సత్యం పద్మశాలి కుల బంధువుల తరపున ప్రత్యేకత ధన్యవాదలు తెలిపారు.

Scroll to Top