ముక్కల్ మండల కేంద్రంలోని టెలిఫోన్ బీడీ కంపెనీ (PKTP)లో 140వ మే డే వాల్ పోస్టర్లు ఆవిష్కరణ
పయనించే సూర్యుడు 28 ఏప్రిల్ 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్‌ని
జామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోతెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (TUCI) ఆధ్వర్యంలో ముక్కల్ మండల కేంద్రంలోని టెలిఫోన్ బీడీ కంపెనీ (PKTP)లో 140వ మే డే వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి m. ముత్తన్న మాట్లాడుతూ కొడుకుకు తండ్రి ఎవరు తెలువనటువంటి పరిస్థితి ప్రపంచంలో 1886 పూర్వం ఉండేదని కార్మికులను ఆ విధంగా యాజమాన్యాలు శ్రమదోపిడి చేసేవని వారికి కనీస వేతనం కూడా ఇచ్చేవారు కాదని ఈ దోపిడిని సహించలేనటువంటి కార్మికులు అమెరికాలోని చికాగో నగరంలో 1886 సంవత్సరంలో కనీస వేతనాలు లేకుండా శ్రమదోపిడి చేస్తున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నటువంటి క్రమంలో అక్కడి ప్రభుత్వం వారిపైన కాల్పులు జరిపి కార్మికులను పొట్టన పెట్టుకుందని వారి పోరాట ఫలితమే ఈరోజు ప్రపంచంలో 8 గంటల పని దినం అమలైందని వారు అన్నారు కానీ దేశంలో NDA బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చి కార్మికులు సంఘటితమయ్యే హక్కులు సంఘాన్ని ఏర్పాటు చేసుకునే హక్కును అదేవిధంగా కనీస వేతనాలు లేకుండా 8 గంటల పని దినాన్ని రద్దు చేస్తూ ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్, యాజమాన్యాలకు అనుకూలంగా 4లేబర్ కోడ్లను చేసిందని వారు అన్నారు మే డే స్ఫూర్తితో దేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ ఒక్కతాటిపైకి వచ్చి నరేంద్ర మోడీ తీసుకువచ్చిన నాలుగు లేబర్ కకోడ్లను ను రద్దు చేసే అంతవరకు ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టి యు సి ఐ ఏరియా నాయకులు ఎండి నజీర్ నిమ్మల నిఖిల్ రాధా రమ్య గోదావరి మమత గంగాధర్ సంగీత రాజమణి దేవదాస్ లక్ష్మణ్ వినయ్ తదితరులు పాల్గొన్నారు
