ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని పరామర్శించిన నామన రాంబాబు

పయ నించే సూర్యుడు జూలై 20 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)ముద్రగడ పద్మనాభం మృతికి నివాళులు అర్పించిన బిజెపి నాయకులుమహామనిషి, కాపు ఉద్యమ నేత, రాజీపడని పోరాట యోధుడు, మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం స్వర్గస్తులైన నేపథ్యంలో కిర్లంపూడిలోని వారి స్వగృహం నందు వారి కుమారులు ముద్రగడ బాలు మరియు ముద్రగడ గిరి లను కలిసి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ నామన రాంబాబు, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ బొంతు పెదబాబు, బిజెపి సీనియర్ నాయకులు పాలూరి సత్యానందం, నామన శ్రీనివాస్ తదితరులు పాల్గొని ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ముద్రగడ పద్మనాభం సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు.