మున్సిపల్ నూతన కార్యాలయ భవన పనులను పరిశీలించిన మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో :నిర్మల్ పట్టణంలో పాత భవనము వెనుక నిర్మాణంలో ఉన్న మున్సిపల్ నూతన కార్యాలయ భవన పనులను మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతి, నాణ్యత ప్రమాణాలు మరియు అవసరమైన సౌకర్యాలపై అధికారులతో కలిసి పరిశీలించి పలు సూచనలు చేశారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ గోపు గోపి, పెండం శ్రీనివాస్, రాఘవేంద్ర చారి, గుంజల చైతన్య, లక్కాకుల హరీష్, మాజీ కౌన్సిలర్ తోట నర్సయ్య,నల్లూరి పోశెట్టి నాయకులు ఆడప శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.