ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు 28.08.2026 కార్యక్రమ వివరాలు

August 27, 2026 | ఆంధ్రప్రదేశ్

ప య నించే సూర్యుడు ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలో ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు రేపు ఉదయం 10:00 గంటల నుండి వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. 1) చిర్రయానం హాబిటేషన్‌లో రూ. 41.40 లక్షల వ్యయంతో చేపట్టిన పైప్‌లైన్ మరియు 334 నల్లాల ఏర్పాటు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 2) నీళ్లరేవు–వయ అడవిపేట రోడ్డు పనులకు రూ. 10.67 కోట్ల అంచనా వ్యయంతో 19 కిలోమీటర్ల బీటీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. 3) బక్కివారిపేట హాబిటేషన్, గెద్దనపల్లి గ్రామ పంచాయతీలో రూ. 95.60 లక్షలతో నిర్మించిన 40 KL ఓవర్‌హెడ్ నీటి నిల్వ ట్యాంక్‌ను ప్రారంభిస్తారు. 4) రావులచెరువు హాబిటేషన్, కొప్పిగుంట గ్రామ పంచాయతీలో రూ. 40.84 లక్షలతో నిర్మించిన 20 KL ఓవర్‌హెడ్ నీటి నిల్వ ట్యాంక్‌ను ప్రారంభిస్తారు. 5) పల్లంకుర్రు గ్రామ పంచాయతీలో రూ. 24.10 లక్షలతో నిర్మించిన 30 KL ఓవర్‌హెడ్ నీటి నిల్వ ట్యాంక్‌ను ప్రారంభిస్తారు. పై కార్యక్రమాలకు కూటమి నాయకులు, అభిమానులు, ప్రజలు, గ్రామస్తులు, మీడియా మిత్రులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరడమైనది. ఇట్లు శాసనసభ్యుల కార్యాలయం, మురమళ్ళ.

🌐 Select Language:
📰 ePaper