ఏర్గట్ల ఉన్నత పాఠశాల గ్రంథాలయానికి 3 లక్షల రూపాయల విలువైన పుస్తకాలు వితరణ.

August 27, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడుD.27.8.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. బాల్కొండ నియోజకవర్గంలో ఏరుగట్ల మండల కేంద్రంలో పి ఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఏరుగట్ల గ్రంథాలయానికి సుమారు 3లక్షల రూపాయల విలువైన పుస్తకాలను కీర్తిశేషులు ఎలిగేటి రాజారాం జ్ఞాపకార్థం వారి కుమారులైన ఎలిగేటి అశోక్ దంపతులు పాఠశాల గ్రంధాలయానికి అందజేశారు..ఏరుగట్ల గ్రామస్తులైన వీరు ముంబైలో స్థిరపడి తాను చదువుకున్న పాఠశాల కోసం ఏదైనా చేయాలని సంకల్పంతో ఈ పుస్తకాలను అందజేశారు.ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలోదాత ఎలిగేటి అశోక్ మాట్లాడుతూ తాను చదువుకున్న పాఠశాలకు ఏదైనా చేయాలి అనే సత్సంకల్పంతో ఈ పుస్తకాలను ఇవ్వడం జరిగిందని, ఈ పుస్తకాలను
తప్పకుండా విద్యార్థులు చదివి మంచి జ్ఞానాన్ని సంపాదించుకోవాలని కోరడం జరిగింది.ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు మునిరుద్దీన్ మాట్లాడుతూ కన్న ఊరుకు చేసే సేవ చాలా గొప్పదని అందులో పాఠశాలకు చేసే సేవ ఎప్పటికీ గుర్తుంటుంద ని, ఇన్ని లక్షల విలువైన పుస్తకాలను అందించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని తెలియజేశారు. సెలవు పై వెళ్లిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణాచారి చరవాణి ద్వారా మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధిలో పాలుపంచుకోవడం, గ్రంధాలయానికి విలువైన పుస్తకాలు అందించడం చాలా గొప్ప విషయమని వారికి ధన్యవాదాలు తెలిపారు.. పాఠశాల గ్రంధాలయానికి తోడ్పాటు అందించిన శ్రీమతి ఎలిగేటి అశోక్ గీత దంపతులను పాఠశాల ఉపాధ్యాయ బృందం సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వారి మిత్ర బృందం తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు ప్రవీణ్ శర్మ ప్రసాద్ రాజ నరసయ్య విజయ్ గంగా మోహన్ ట్వింకిల్,సమత జ్యోతి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు..

🌐 Select Language:
📰 ePaper