మూసాపేట్ ఇందిరానగర్‌లో ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం ఘనంగా నిర్వహణ

June 21, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 21 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మూసాపేట్, ఇందిరానగర్‌లో ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా నిర్వహించిన ఉచిత వైద్య ఆరోగ్య శిబిరం ఘనంగా జరిగింది. గుడికాడి శ్రీనివాస్ గౌడ్, లోడే నవీన్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య శిబిరాన్ని సందర్శించి, చికిత్స కోసం వచ్చిన ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులు అందిస్తున్న సేవలు, పరీక్షలు, వైద్య సదుపాయాల గురించి వివరాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ… ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అందుబాటులో ఉన్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు. అనంతరం పేద మధ్యతరగతి విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేశారు , వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వడ్డేపల్లి రాజేశ్వర్ ని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మూసాపేట్ డివిజన్ సీనియర్ నాయకులు కర్కా డాకయ్యా, మల్లేష్ గౌడ్,ఐలయ్య యాదవ్, తుమ్ శైలేష్, శేఖర్ గుప్తా, కృష్ణ యాదవ్, ఈ.సాయి,రవి గౌడ్ స్థానిక నాయకులు, కార్యకర్తలు, వైద్య సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper