మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం వైసిపి నాయకులు
పయనించే సూర్యుడు డిసెంబర్ 10 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
అనుకూలమైన వారికి అందించేందుకే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నియోజకవర్గ పరిశీలకులు పేర్నాటినియోజకవర్గాల సంతకాల ప్రతులు జిల్లా కేంద్రానికిజెండా ఊపి ప్రారంభించిన నాయకులు, ప్రజాప్రతినిధులురాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసి తమ అనుకూలమైన వారికి పీపీపీ విధానంలో కట్టబెట్టి ప్రజలను దగా చేసేందుకు సిద్దమవుతున్నారని, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో అందరం కలిసి దానిని అడ్డుకుందామని ఆత్మకూరు నియోజకవర్గ పార్టీ పరిశీలకులు, రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి కోటేశ్వర రెడ్డి అన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ ప్రతులను జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య. కూనం సుధాకర్ రెడ్డి, పార్టీ మున్సిపల్ విభాగ రాష్ట్ర కార్యదర్శి అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి, ఆర్టీఐ రాష్ట్ర బాధ్యుడు పూనూరు రామ్మనోహర్ రెడ్డి, ఎస్సీసెల్ రాష్ట్ర విభాగ కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి రమేష్ రెడ్డి, మండలాల కన్వీనర్లు బిజివేముల పిచ్చిరెడ్డి, చెన్ను వెంకటేశ్వర్లు రెడ్డి, పులగం శంకర్ రెడ్డిలతో కలసి బుధవారం జిల్లా కేంద్రమైన నెల్లూరుకు తరలించేందుకు ప్రత్యేక కార్యక్రమం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో చేపట్టారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న పేర్నాటి కోటేశ్వర రావు మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణలో ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని ప్రజల సహకారంతోనే నియోజకవర్గంలో 60వేలకుపైగా సంతకాల సేకరణ జరిగిందన్నారు. పేదలకు వైద్య విద్య, వైద్యం దూరం చేసేలా కూటమి పాలనలో ప్రైవేటీకరణ జీఓను ప్రవేశపెట్టడం దారుణమన్నారు. గత వైఎస్సార్ పాలనలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనల మేరకు విద్యతోనే యువత అభివృద్ధి సాధ్యం అన్న లక్ష్యంతో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను మంజూరు చేయించి అందులో ఏడు కళాశాలలను పూర్తి చేశారన్నారు. ఇంతలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అప్పనంగా మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణకు పూనుకోవడం ప్రజలను దగా చేయడమేనన్నారు. జగనన్న పాలనలో రెండేళ్ల కరోనా సమయంలో వైద్యసేవలు ఇంటింటికి అందించారన్నారు. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థతో ఇవన్నీ సాధ్యమయ్యాయని, కూటమి పాలనలో ఆ వ్యవస్థలను నాశనం చేశారని దుయ్యబట్టారు. పీహెచ్ సీలకు ఇద్దరు డాక్టర్ల ఏర్పాటు, జగనన్న ఆలోచనల మేరకు జరిగిందన్నారు. ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతతో ప్రభుత్వం ఇప్పటికైనా ప్రవేటీకరణ ఆలోచనను మానుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా సేకరించిన ప్రతులను 15వ తేదీ పార్టీ కేంద్ర కార్యాలయానికి చేర్చనున్నట్లు ఆ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం నియోజకవర్గ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలసి సంతకాల సేకరణ ప్రతులను నెల్లూరు పార్టీ కార్యాలయానికి తరలించే వాహనానికి జెండా ఊపి ప్రారంభించారు. ప్రతులను తీసుకెళ్లే ప్రత్యేక వాహనం ముందు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆర్టీసీ డిపో వరకు ర్యాలీగా సాగారు.
