యాదవ్ బుడోఖాన్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

July 29, 2026 | తెలంగాణ

కీ.శే. కరాటే లెజెండరీ గ్రాండ్ మాస్టర్ మల్లేష్ యాదవ్ కు గురు పౌర్ణమి సందర్భంగా నివాళులు

గురువును స్మరించుకున్న కరాటే శిష్యులు మాస్టర్లు

(పయనించే సూర్యుడు జూలై 30షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )గురుపౌర్ణిమ సందర్భంగా షాద్ నగర్ పట్టణంలోని యాదవ్ బుడోకాన్ కరాటే క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో యాదవ్ బుడోఖాన్ కరాటే క్లబ్ సంస్థ వ్యవస్థాపకులు, కరాటే లెజెండరీ గ్రాండ్ మాస్టర్ కీ.శే. ఎస్. మల్లేశ్ యాదవ్‌కు శిష్యులు ఘనంగా నివాళులర్పించి తమ యొక్క గురువును పూజించుకున్నారు. కరాటే చిన్నారులు, బ్లాక్ బెల్ట్ విద్యార్థులు, మాస్టర్లు గ్రాండ్ మాస్టర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించి గురువుపట్ల తమ భక్తి, గౌరవాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ సాయినాథ్ మాట్లాడుతూ..గురువు జీవితానికి దిక్సూచి అని, జ్ఞానాన్ని అందించి విజయ మార్గంలో నడిపించే మహోన్నత వ్యక్తి గురువేనని అన్నారు. గురువు ఋణాన్ని ఎప్పటికీ మరవకూడదని, ప్రతి శిష్యుడు గురువును గౌరవించడం తన కర్తవ్యంగా భావించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉతేజ్, వినయ్, శ్రీను, బ్లాక్ బెల్ట్ విద్యార్థులు, శిక్షకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని గురువుల పట్ల తమ కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేశారు. గురుపౌర్ణిమ వేడుకలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.

🌐 Select Language:
📰 ePaper