యువతను మత్తుకు దూరంగా ఉంచేందుకు రామచంద్రపురం బిజెపి ఆధ్వర్యంలో నషా ముక్తి యువ కార్యక్రమం యువతకు బిజెపి నేతల పిలుపు
పయనించే సూర్యుడు ఆగస్టు 9 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ) ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశానుసారం యువతను మత్తు పదార్థాల బారి నుండి కాపాడేందుకు “నషా ముక్తి యువ” కార్యక్రమాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణ బిజెపి కార్యకర్తలు శివాలయం ఎదురుగా ఉన్న భారతమాత విగ్రహం వద్ద నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు దునే శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రామచంద్రపురం మండల ఇన్చార్జి రమణమూర్తి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సలాది సతీష్ నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు, మద్యానికి బానిసై కుటుంబాలకు ఆవేదన కలిగించవద్దని, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, మత్తు పదార్థాలు సమాజ వినాశనానికి కారణమవుతాయని తెలిపారు. తల్లితండ్రులు పిల్లల ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనించి చెడు అలవాట్లను మాన్పించాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే యువత సత్ప్రవర్తనతో దేశ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆకేటి శ్రీకృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు హరిబాబు, బుల్లి అబ్బులు, సీనియర్ నాయకులు కుప్పెల సూర్యనారాయణ, కళ్యాన్, యువ మోర్చా అధ్యక్షులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.