రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌కు ఘన సన్మానం
పయనించే సూర్యుడు జూన్ 30 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌కు స్థానిక కూటమి నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు పి.ఎస్.ఎన్. రాజు (విలేకర్ రాజు), ఎస్.వి.ఎస్. వర్మ, బీజేపీ నాయకుడు నంద్యాల వెంకటరెడ్డి (చంటి), జనసేన నాయకుడు బీమాల సూరి నాయుడు గజమాలలు, దుశ్శాలువాలతో ఎంపీ సానా సతీష్‌ను సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ, ప్రజాసేవలో ఎంపీ సానా సతీష్ మరింత విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.