ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్‌కు దీటైన విద్య అందించాలి నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిత్ర

June 30, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ తక్షణమే పూర్తి చేయాలిప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉండాలిజిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మంగళవారం లోకేశ్వరం మండలంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రభుత్వ ఆసుపత్రి, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ), రైతు వేదికలో కొనసాగుతున్న ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియతో పాటు ఆయిల్ పామ్ వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోజువారీ ఓపీ వివరాలు, మందుల లభ్యత, మౌలిక వసతులపై ఆరా తీశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన రోగులను ఉన్నత స్థాయి ఆసుపత్రులకు వెంటనే రిఫర్ చేయాలని సూచించారు. చికిత్స కోసం వచ్చే ప్రతి రోగికి అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఆసుపత్రి రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు.అనంతరం స్థానిక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (కేజీబీవీ) సందర్శించిన కలెక్టర్, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ విద్యాసంస్థలకు దీటుగా నాణ్యమైన విద్య అందించాలని పేర్కొన్నారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రతిరోజూ మెనూ ప్రకారం పోషకాహారంతో కూడిన నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. విద్యార్థుల్లో అభ్యాస నైపుణ్యాలు, సృజనాత్మకత, చదువుపై ఆసక్తి పెంపొందేలా వినూత్న బోధనా విధానాలు అమలు చేయాలని సూచించారు. పలువురు విద్యార్థులతో మమేకమై వారి విద్యా ప్రగతిని స్వయంగా పరిశీలించారు.అనంతరం మండల రైతు వేదికలో కొనసాగుతున్న ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను సమీక్షించారు. మండలంలోని మొత్తం రైతుల సంఖ్య, పూర్తయిన నమోదు, పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇంకా నమోదు చేసుకోని రైతులను గుర్తించి వారితో వ్యక్తిగతంగా సంప్రదించి ఫార్మర్ రిజిస్ట్రీని త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులతో మాట్లాడిన కలెక్టర్, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందేందుకు ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసుకోవాలని సూచించారు.అనంతరం స్థానిక రైతు సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటను సందర్శించి పంట సాగు విధానం, దిగుబడి, మార్కెట్ అవకాశాలపై రైతుతో చర్చించారు. భవిష్యత్‌లో అధిక ఆదాయాన్ని అందించే ఆయిల్ పామ్ వంటి వాణిజ్య పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు.ఈ పర్యటనలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి రాజేందర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, హార్టికల్చర్ అధికారి రమణ, తహసీల్దార్ సూర్యారావు, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper