రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్గట్ల మండల మహిళా సమాఖ్యకు కేటాయించిన నూతన RTC బస్సు ప్రారంభం.
పయనించే సూర్యుడు 9 జూన్ 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ : బాల్కొండ నియోజకవర్గంలో ఏరుగట్ల మండలం ఈరోజు మంగళవారం రోజున ఏర్గట్ల మండలం తడపాకల్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మండల మహిళా సమైక్యకు కేటాయించిన నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించడం జరిగింది. ఈరోజు హైదరాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 553 బస్సులను మహిళా సమైక్య సంఘాలకు అప్పగించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మండల మహిళా సమాఖ్య సభ్యులు అదే బస్సులో బయలుదేరి వెళ్ళారు. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, నాయకులు కార్యకర్తలు జెండా ఊపి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని చేస్తూ మహిళా సమాఖ్య సంఘాలకు స్వయం ఉపాధి కొరకు బస్సులను అందించినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపారు.