రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలనపై డోర్ టు డోర్ సర్వేను విజయవంతం చేయాలి : ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు

July 22, 2026 | సినిమా వార్తలు

ముమ్మిడివరం, జూలై 22 :రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ఈ నెల 27 నుంచి నిర్వహించనున్న ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆదేశాల మేరకు ముమ్మిడివరం ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దాట్ల సుబ్బరాజు పార్టీ నాయకులు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు.ప్రభుత్వ పథకాలపై అవగాహనఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ రెండేళ్ల పాలన, సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు సమర్థవంతంగా వివరించాలని కోరారు. ప్రభుత్వ విజయాలను, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు.ఆన్‌లైన్ తీర్మానాలు
అనంతరం మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జ్‌లతో వివిధ అంశాలపై చర్చించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వాటిని ఆన్‌లైన్ తీర్మానాల రూపంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, చెల్లి వివేకానంద, నియోజకవర్గ పరిశీలకురాలు సుంకర పావని, జిల్లా ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు నాగిడి నాగేశ్వరరావు నడింపిల్లి సుబ్బరాజు సాగిరాజు సూరిబాబు రాజు విత్తనాల వెంకటరమణ ,చెల్లి సురేష్ , వెంట్రు సుధీర్ ఇతర ముఖ్య నాయకులు, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జ్‌లు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper