రాష్ట్ర స్థాయి కిడ్స్ అథ్లెటిక్స్ పోటీలకు సాయి చెల్సియ రాథోడ్

July 27, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు గాంధారి 28/07/26 రాష్ట్ర స్థాయి కిడ్స్ అథ్లెటిక్స్ పోటీలకు గాంధారి మండలం సోమారం తండాకు చెందిన సాయి చెల్సియా రాథోడ్ ఎంపిక అయినట్లు ఆమె తండ్రి లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ క్రీడా మైదానంలో జరిగిన జిల్లా స్థాయి పోటీలో అండర్ 10 వయస్సు కేటగిరిలో 60 మీటర్ ల పరుగు పందెం లొ పోటీపడిన ఆమె బంగారు పతకం సాధించింది. రాష్ట్ర స్థాయి పోటీలు వచ్చే నెల 7.8 నా హన్మకొండ జరిగే పోటీలో ఆమె కామారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రస్తుతం చెల్సియా రాథోడ్ తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ లొ 4వ తరగతి చదువుతుంది.గెలుపొందిన ఆమెకు కామారెడ్డి సిఐ శ్రీధర్ గౌడ్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి కార్యదర్శి అనిల్ శ్రీనివాస్ బహుమతి అందించారు. రాష్ట్ర స్థాయికి ఎంపిక అయినా చెల్సియా ను మండల ప్రజాప్రతినిధులు యువకులు భామన్ నాయక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు గుగ్లోత్ సురేందర్ సేవంత రాథోడ్, బాల కృష్ణ అభినందించారు

🌐 Select Language:
📰 ePaper