రేపటి విద్యాసంస్థల బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం.

July 23, 2026 | తెలంగాణ

పృథ్వీరాజ్ అధ్యక్షులుడా.బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ నియోజకవర్గం

: పయనించే సూర్యుడు జూలై 24మక్తల్ :దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున నీట్ వరుస లీకుల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన దాదాపు 20 మంది విద్యార్థుల ప్రాణాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని అలాగే విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ప్రభుత్వం స్పందించాలని నిరసనలు చేపట్టిన విద్యార్థి యువకులపై బిజెపి ప్రభుత్వం నిరంకుశంగా లాఠీ ఛార్జ్ చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థి సంఘాలు ఇచ్చిన రేపటి రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ కు అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ లో సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నమన్నారు.దేశ భవిష్యత్తును నిర్మాణం చేసే విద్యార్థులపై పోలీసులతో దాడి చేయించడమనేది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల పిలుపుమేరకు రేపటి రాష్ట్ర వ్యాప్త విద్యాసంస్థల బందుకు స్వచ్ఛందంగా మద్దతును ప్రకటిస్తూ బందును పాటించాలని ఈ ప్రాంత విద్యాసంస్థలను వాటి యజమానులను,ప్రజాస్వామిక వాదులను కోరుతున్నామన్నారు.

🌐 Select Language:
📰 ePaper