రైతులు యూరియా విషయంలో ఆందోళన చెందవద్దు మన జిల్లాకు సరిపడా యూరియా అందుబాటులో ఉంది.

June 15, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడుD.15.6.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్* ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి చొరవతో 39వేల మెట్రిక్ టన్నులకు పైగా యూరియా నిజామాబాద్ జిల్లాలో స్టోర్ అయి ఉన్నది. దాని నుండి 16 వేల మెట్రిక్ టన్నుల యూరియాని జిల్లాకు చెందిన ఒక లక్ష యాభై వేల మంది రైతులు అప్లికేషన్ ద్వారా బుక్ చేసుకుని యూరియాని డెలివరీ చేసుకున్నారు. ఇంకా 23 వేల మెట్రిక్ టన్నులకు పైగా యూరియా అందుబాటులో ఉన్నది.* గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భ్రష్టు పట్టుపోయి డిఫాల్ట్ గా మిగిలిపోయిన సొసైటీల కారణంగా యూరియాని డబ్బులు కట్టి తీసుకురాలేని పరిస్థితిల్లో రైతులకు ఇబ్బంది ఏర్పడుతుంది. రైతులు మీ మీ పరిధిలోని సొసైటీలకు వెళ్లి ఇప్పుడున్న చైర్మన్లు మరియు అధికారుల మెడలు వంచి డబ్బులు కట్టించండి. డబ్బులు కట్టించే బాధ్యతను మీరు తీసుకోండి యూరియాను సొసైటీలకు ఇప్పించే బాధ్యతను నేను తీసుకుంటాను. సొసైటీలు వారి చేతకాని విధానాన్ని ప్రభుత్వం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. కావున రైతులు ప్రతిపక్షాల మాటలకు మోసపోవద్దు అప్లికేషన్ ద్వారా రైతులకు ఇబ్బంది అవుతున్న మాట వాస్తవమే కానీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు 5 సంచులు అవసరం ఉన్నవారు 20 సంచులు దాచి పెట్టుకోవడం వల్ల కొరత ఏర్పడే అవకాశం ఉన్నందున ఈ ఉద్దేశ్యంతో అప్లికేషన్ విధానాన్ని తీసుకు రావడం జరిగింది. యూరియా అందుబాటులో ఉంది బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రైతులు అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను

🌐 Select Language:
📰 ePaper